పీసీసీలకు త్వరలో కొత్త కమిటీలు 

 పీసీసీలకు త్వరలో కొత్త కమిటీలు 

పది రోజుల్లో పీసీసీలకు కొత్త కమిటీలు నియమించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్ ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా అన్ని పీసీసీలను తిరిగి నియమించాలనీ...వాటితో పాటు కొత్తగా ఎన్నికల ఐదు కమిటీలను నియమించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా జ‌న‌వ‌రి 8వ తేదీలోగా ఎన్నిక‌ల కోసం  పీసీసీ స్థాయిలో 5 క‌మిటీల‌ను ఏర్పాటు చేయాలి. అందులో కో ఆర్డినేష‌న్ క‌మిటీ, ప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిటీ, ప్రచార క‌మిటీ, ప‌బ్లిసిటీ క‌మిటీ, మీడియా కో ఆర్డినేష‌న్ క‌మిటీ నియ‌మించి 15వ తేదీ నుంచి ప‌నులు ప్రారంభించాల‌ని ఆదేశించింది. బూత్ క‌మిటీలు అన్ని జ‌న‌వ‌రి 30వ వ‌ర‌కు పూర్తి చేయాల‌ని, ఫిబ్రవ‌రి నెలాఖ‌రు నాటికి కొత్తగా నియామ‌క‌మైన బూత్‌, బ్లాక్‌, అసెంబ్లీ స్థాయి క‌మిటీల‌కు శిక్షణ పూర్తి చేయాల‌ని ఏఐసీసీ ఆదేశించింది. పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక‌కు సంబంధించి ప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశాలు, డీసీసీల నుంచి సిఫార‌సులు త‌దిత‌ర కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించారు.