జగన్‌కు కొత్త కాన్వాయ్‌..

జగన్‌కు కొత్త కాన్వాయ్‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జగన్‌కు జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పుడు సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను మార్పు చేసింది. కొత్తగా 6 బ్లాక్‌ కలర్‌ ఫార్చ్యునర్ వాహనాలను జగన్‌ కాన్వాయ్‌లో చేరాయి. ఈ ఫార్చ్యూనర్ వాహనాలతో పాటు జామర్, అంబులెన్స్, పోలీసు ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. AP39 PA 2345 నంబరుతో ఈ వాహన శ్రేణి ఉంటుంది. జగన్‌ పాత కాన్వాయ్ ని హైదరాబాద్‌కు తరలించారు. జగన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ కాన్వాయ్‌ని ఉపయోగిస్తారు.