కావాలని దగ్గితే ఆట నుండి ఔట్...

కావాలని దగ్గితే ఆట నుండి ఔట్...

ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా అన్ని క్రీడలు వాయిదా పడ్డాయి. కానీ కరోనా బ్రేక్ తర్వాత ఫుట్ బాల్ గేమ్ ముందుగా ప్రారంభమైంది. ఈ గేమ్స్ టోర్నీలు ఇప్పటికే రెండు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మరో కొత్త కరోనా నియమం ఆటలోకి తీసుకొని వచ్చింది అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం. అదేంటంటే... కావాలని ఏ ఆటగాడైన మరో ఆటగాడి దగ్గరికి లేదా సిబ్బంది వద్దకు వెళ్లి దగ్గితే ఈ నియమం ప్రకారం అంపైర్ ఆ ఆటగాడికి రెడ్ కార్డు ఇస్తాడు. దాంతో ఆటగాడు ఇక ఆ గేమ్ ఆడలేడు. ఆ సంఘటన ప్రభావం కారణంగా ఎల్లో కారు కూడా ఇవ్వచ్చు.  ఒకవేళ ఆ దగ్గిన ఆటగాడు అందరికి దూరంగా దగ్గిన లేదా అతను కావాలని దగ్గలేదు అని అంపైర్ భావించిన అతనిపై ఏ విధమైన చర్యలు తీసుకోరు.