రేపే మొదటి మ్యాచ్.. కరోనా నియమాలు ఏంటేంటో తెలుసా..?

రేపే మొదటి మ్యాచ్.. కరోనా నియమాలు ఏంటేంటో తెలుసా..?

ఈ ఏడాది క్రికెట్ ప్రపంచం లో చాల ముఖ్యమైనది. ఎందుకంటే... ఈ 2020ల లో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే టీ 20 ప్రపంచ కప్, ఆసియా కప్ తో పాటుగా మన దగ్గర ప్రతి ఏడాది జరగాల్సిన ఐపీఎల్ ఉన్నాయి. దాంతో క్రికెట్ అభిమానులు చాల ఆనదించారు. కానీ వారందరి సంతోషానికి బ్రేక్ వేసింది కరోనా. ఈ వైరస్ కారణంగా ఈ టోర్నమెట్లే కాదు చాల జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ లు కూడా నిలిచిపోయాయి. ఇక కరోనా ఇచ్చిన 3 నెలల విరామం తర్వాత మళ్ళీ రేపటి నుండే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం కానుంది. ఇందులో ఇంగ్లాండ్-వెస్టిండీస్ తలపడుతున్నాయి. అయితే కరోనా సమయం లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఇక ముందు జరగనున్న అన్ని మ్యాచ్ ల కోసం ఐసీసీ కొన్ని కొత్త కరోనా నియమాలను తీసుకవచ్చింది. రేపు  సౌతాంప్టన్‌లో లో జరగనున్న ఈ మ్యాచ్ లో కూడా ఆ నియమాలతో పాటుగా ఇంగ్లాండ్ & వెల్స్ క్రికెట్ బోర్డు ముందు జాగ్రత్తగా మరి కొన్ని నియమాలను అందులో కలిపింది. అయితే ఆ కొత్త కరోనా నియమాలు ఏంటో తెలుసా. 

1. బంతిపై సెలైవ వాడటం నిషేధం

2. షేక్ హ్యాండ్స్, ఆలింగనాలు ఉండవు 

3. టాస్ సమయంలో రిఫరీ ఉండడు, కేవలం కెప్టెన్లు మాత్రమే 

4. ప్రేక్షకులకు నో ఎంట్రీ, బదులుగా వారి రికార్డింగ్ సౌండ్స్

5. బాల్ బాయ్స్ ఉండరు

6. 70 ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్స్ తప్పనిసరి

ఇంగ్లాండ్: బెన్ స్టోక్స్ (సి), జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్ (wk), జాక్ క్రాలే, జో డెన్లీ, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

వెస్టిండీస్: జాసన్ హోల్డర్ (సి), జెర్మైన్ బ్లాక్వుడ్, న్క్రుమా బోన్నర్, క్రైగ్ బ్రాత్‌వైట్, షమర్ బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, రోస్టన్ చేజ్, రాహకీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్ (wk), షానన్ గాబ్రియేల్, కెమర్ హోల్డర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, రేమోన్ రీఫెర్, కేమర్ రోచ్.