కామారెడ్డి లో విషాదం.. నవ జంట ఆత్మహత్య

కామారెడ్డి లో విషాదం.. నవ జంట ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో నవ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన మలావత్ మహేందర్ కు 3 నెలల క్రితం నాగిరెడ్డిపేట మండలం ఎర్రకుంట తండాకు చెందిన శిరీషతో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి వీరి జీవితం ఆనందంగానే సాగింది. ఎప్పుడు గొడవపడలేదు. అందరితో కలిసి ఉండేవారు. ఇటీవల శిరీష తన పుట్టింటికి వచ్చింది. బుధవారం శిరీషను తీసుకుపోయేందుకు మహేందర్ వచ్చాడు. గురువారం సాయంత్రం గోపాల్ పేట వెళ్లి వస్తామని చెప్పి ఇద్దరు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. వీరిని వెతుకుతున్న క్రమంలో పోచారం జలాశయంలో వీరి శవాలు దొరికాయి. వీరి మరణానికి కారణం తెలియరాలేదు. నవ జంట ఆత్మహత్యకు పాల్పడడంతో అక్కడ విషాద చాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.