క్యాన్సర్ ను నిరోధించే కొత్త డ్రగ్

క్యాన్సర్ ను నిరోధించే కొత్త డ్రగ్

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ ను అరికట్టేందుకు మరో కొత్త డ్రగ్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఇంకా ప్రయోగదశలోనే ఉన్న ఈ డ్రగ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన అధ్యయనం ప్రకారం శరీర భాగాల్లో తయారయ్యే కణితులను కరిగించడంలో తాజా డ్రగ్ గణనీయంగా పని చేసిందని వైద్యులు చెబుతున్నారు. 

విస్టుసర్టిబ్, పసిలిటాక్సిల్ కాంబినేషన్లో రూపొందించిన తాజా డ్రగ్ క్యాన్సర్ బాధితుల జీవితకాలాన్ని తప్పకుండా పెంచుతుందని ఆశిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ బాధితుల్లో సగం మందికి, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో 35 శాతం మందికి తాజా డ్రగ్ విజయవంతంగా పని చేసినట్లు నిర్ధారించారు. లండన్లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు రాయల్ మార్స్ డెన్ ఎన్ఎచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ డ్రగ్ తయారీలో పని చేశాయి. అంతేకాదు.. కాక్ టేయిల్ కూడా కణితులు పెరగకుండా తోడ్పడుతాయని వారు గుర్తించారు.