బయోపిక్ లకు మహానటి నాంది అవుతుందా..!

బయోపిక్ లకు మహానటి నాంది అవుతుందా..!

ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రల గురించి, మహామహుల జీవితాల గురించి బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి.  చాలా వరకు అవి విజయం సాధించాయి.  చరిత్రలో విజయం సాధించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారి జీవితాలను కథలుగా మలచుకుని సినిమా తీస్తే తప్పకుండా చూస్తారనే ఫార్ములాను బాలీవుడ్ నిరూపించింది.  ఇప్పుడు ఇదే ఫార్ములాను టాలీవుడ్ ఫాలో అవుతున్నది.  సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటితో బయోపిక్ పరంపర మొదలైందని చెప్పొచ్చు.  ఇప్పటికే కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.  మరికొన్ని కథాచర్చల దగ్గర ఉన్నాయి.  

సినిమా అభిమానులందరిలోను ఆసక్తి రేపుపుతున్న సినిమా మహానటి.  సావిత్రి గురించి తెలియని తెలుగు వ్యక్తులు ఉండరు. మహానటి సినిమా సావిత్రి జీవిత చరిత్రకు సంబంధించినదే అయినప్పటికి మహామహుల ప్రస్తావన ఇందులో ఉన్నది. సావిత్రి జీవిత కథ అంతటి ఆసక్తికరంగా మారడానికి ఇది ఒకకారణమే చెప్పొచ్చు.  ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  భారీ ఓపెనింగ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  అందరు అనుకున్నట్టు కాకుండా.. అందరికి నచ్చే విధంగా సినిమా ఉందని టాక్ వస్తోంది.  మహానటి తరువాత తెలుగులో మరిన్ని బయోపిక్ లు వచ్చే అవకాశం ఉన్నది.