బీరులో సరికొత్త రుచులు, ప్రొటీన్లు

బీరులో సరికొత్త రుచులు, ప్రొటీన్లు

బీర్, వైన్, లిక్కర్ వంటి మత్తుపదార్థాల్లో ఇప్పటికే ఎన్నో వైరైటీస్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వెరైటీది ఒక్కో ప్రత్యేకమైన రుచి. అయినా మరో సరికొత్త రుచిని కస్టమర్లకు అందించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడున్న రుచులు, ఫ్లేవర్స్ ని బట్టి.. తదుపరి ఎలాంటి ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో ప్రిడిక్ట్ చేస్తూ.. ఆ టార్గెట్ ఉత్పత్తిని తయారు చేసేందుకు సరికొత్త ఆల్గారిథమ్ ను క్రియేట్ చేశారు. 

పలు తినుబండారాల్లో వాడే యీస్ట్ ను తాజా ఆల్గారిథమ్ తో ప్రాసెస్ చేయడం ద్వారా బీర్, వైన్, లిక్కర్లకు కొత్త రుచులు రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. యీస్ట్ ను ఆక్సిజన్ కు దూరం చేసినప్పుడు అది ఆల్కహాల్, యాసిడ్స్, పలు రకాల వాయువుల్ని ఉత్పత్తి చేస్తుంది. వాటిల్లో సరికొత్త రుచుల్ని మేళవించే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అందువల్లే బీరుకైనా, లిక్కర్ కైనా, సాధారణ ఆహారంగా వాడే బ్రెడ్డుకైనా కొత్తరకమైన రుచి సంక్రమిస్తుంది.. అంటున్నారు శాస్త్రవేత్తలు. 

అంతేకాదు.. మానవ మెటబాలిజాన్ని మరింత మెరుగయ్యేలా చేసేందుకు అవసరమైన ప్రొటీన్స్ వంటివాటిని ఇదే యీస్ట్ కు జత చేయడం ద్వారా.. బీర్లతోనే శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందించవచ్చని తేల్చారు. వైద్యశాస్త్రపరంగా ప్రజలకు అవసరమైన టీకాలను కూడా ఇలా రూపొందించవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆహారం ద్వారా దొరికే అన్ని పోషకాలను బీర్ల ద్వారా కూడా పొందవచ్చేమో.