ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ తరహా ఫీచర్..

ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ తరహా ఫీచర్..

యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఫొటో షేరింగ్‌ యాప్ ఇన్‌స్టాగ్రామ్ మరో అద్భుత ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియోల షేరింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న టైమ్‌ పరిమితిని తొలగించింది. 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసి పోస్ట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు వీలుండేది. ఆ నిడివిని 60 నిమిషాలకు పెంచింది. ఇందు కోసం 'ఐజీటీవీ' పేరుతో ప్రత్యేక సెక్షన్‌ను యాడ్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ హోమ్‌ స్క్రీన్‌పైన కనిపించే ఈ 'ఐజీటీవీ' ద్వారా 60 నిమిషాల నిడివి గల వీడియోలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఆ వీడియోలను షేర్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ తరహాలో ఇన్‌స్టాగ్రామ్‌ను తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్టు ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ చెప్పింది. అన్నట్టుగానే.. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో యూట్యూబే ఇప్పుడు పాపులర్‌. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.