'వాట్సాప్'లో ఇక ఆ తప్పు జరగదు..!
అంతా సోషల్ మీడియా ప్రపంచం.. నచ్చినది క్షణాల్లో షేర్ చేస్తూ.. కొద్దిసేపట్లోనే దానిని వైరల్‌గా మార్చేస్తున్నారు. దీని వాట్సాప్‌ది ప్రధాన పాత్ర.. అయితే, రానురాను ఫోన్లో మాట్లాడుకునేవారి తగ్గిపోతూ.. వీలైతే మెసేజ్, కుదిరితే వాయిస్ మెసేజ్, మరీ వీలైతే వీడియో కాల్ ఇలా సాగుతోంది. అయితే, సాధారణంగా వాట్సాప్‌లో వీడియో, టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసేముందు ఓసారి క్రాస్ చెక్ చేసుకునే వీలు ఉండడంతో.. తప్పుడు సందేశాలు పంపే అవకాశం ఉండదు. అవసరమైతే టెక్స్ట్ ను మార్చే వీలు కూడా ఉంది. అయితే, ఇది మాత్రం వాయిస్ మెసేజ్‌లో కుదరదు.. ఒక్కసారి బటన్‌నొక్కి మాట్లాడితే.. అది డైరెక్ట్‌గా అవతలి వ్యక్తికి వెళ్లిపోతోంది. దీనిని ఇప్పటి వరకు ఓసారి చెక్‌చేసుకునే వెసులుబాటు లేదు. అయితే, ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఇపుడు వాట్సాప్ సిద్ధమైంది. వాయిస్ రికార్డింగ్ మెసేజ్‌ను సెండ్ చేసేముందు వినేందుకు వీలుగా మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐవోఎస్‌లో బీటా దశలో ఉండగా.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో వాయిస్ మెసేజ్ సెండ్ చేసేముందు.. విని సెండ్ చేసేందుకు వీలు కలుగుతోంది. ఇలా రోజుకో మార్పుతో మరింత మందికి చేరువయ్యేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)