వాట్సాప్ లో కొత్త ఫీచర్.. వాటి గురించి ఇట్టే తెలుసుకోవచ్చు..!!

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. వాటి గురించి ఇట్టే తెలుసుకోవచ్చు..!!

సోషల్ మీడియా యాప్ లో ది బెస్ట్ యాప్ గా చెప్పుకునే వాటిల్లో వాట్సాప్ ఒకటి.  ఈ యాప్ డెవలప్ అనేక మార్పులు చేసుకున్నది.  మెసేజ్ ల నుంచి ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్ వంటి కొత్త కొత్త మార్పులను తీసుకొచ్చింది.  ఒక మెసేజ్ చేసిన తరువాత అది అవతలి వ్యక్తులకు చేరిందో లేదో.. చూశారో లేదో తెలుసుకునే విధంగా మార్పులు చేసుకున్నాయి.  

వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ అయినా షేర్ చేసే అవకాశం ఉన్నది.  నూటికి 70 శాతం ఫేక్ మెసేజ్ లు షేర్ అవుతుంటాయి.  వాటి వలన కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి.  వీటిని పరిష్కరించే దిశగా ఈ యాప్ అడుగులు వేస్తోంది.  గత కొద్దినెలలుగా వీటిపై యూజర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్గిస్తోంది.  వీలైనంత త్వరగా ఫేక్ మెసేజ్ లకు అడ్డుకట్ట వేయాలని వాట్సాప్ సంస్థ ప్రయత్నిస్తోంది. దీంతోపాటు త్వరలోనే వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ను కూడా ప్రారంభించబోతున్నట్టు వాట్సాప్ అధికారి ఒకరు తెలిపారు.