ఏపీ ప్రజలకు కొత్త గవర్నర్ తొలి సందేశం

ఏపీ ప్రజలకు కొత్త గవర్నర్ తొలి సందేశం

తెలుగు భాషా, సంస్కృతి తనకు కొత్త కాదని ఏపీ కొత్త గవర్నర్‌ బి.బి.హరిచందన్ అన్నారు. ఏపీకి పొరుగునే ఉన్న గంజాం జిల్లా తన స్వస్థలం అని చెప్పారు. ఒడిదుడులున్నా ఏపీ అభివృద్ధి సాధిస్తోందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో వెలుగొందుతున్న విజయవాడలో భాగం కావడం సంతోషంగా ఉందని, ఎందరో మేధావులు చూపిన దార్శినికతతో ఏపీ అనేక అంశాల్లో దేశంలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. అద్భుత విజయం సాధించిన జగన్.. వినూత్న పథకాలతో సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 

పాదయాత్ర ద్వారా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పెట్టడమే విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు గవర్నర్‌. జగన్ తండ్రి వైఎస్ నాడు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ జాతి మొత్తానికి ఆదర్శంగా నిలిచిందన్నారాయన. అమ్మఒడి, ఉచిత విద్య ద్వారా అక్షరాస్యత పెంపోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలు అవలంబించడం ప్రశంసనీయమని, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు సాహసోపేత నిర్ణయమని అభిప్రాయపడ్డారు.