నేటి నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ భారం...

నేటి నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ భారం...

కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు కొనేవారిపై నేటి నుంచి ఇన్సూరెన్స్ రూపంలో భారం పడబోతోంది. మోటారు వాహన చట్టం ప్రకారం... థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనివల్ల రోడ్డుప్రమాదం జరిగినప్పుడు ఎదురుటువారికి కలిగిన నష్టాన్ని బీమా సంస్థ భరిస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై దీర్ఘకాలిక బీమా చేయించుకోవాలి. కొత్త కార్లకు మూడేళ్ల కాలానికి, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల కాలానికి థర్డ్  పార్టీ ఇన్సూరెన్స్ చేయనున్నాయి బీమా కంపెనీలు. 1000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన కార్లపై మూడేళ్లకు థర్డ్ పార్టీ బీమాగా రూ.5,286 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వెయ్యి నుంచి 1500 సీసీ వరకు వాహనాలకు రూ.9,534, ఇక 1500 సీసీకి పైగా సామర్థ్యం ఉన్న కార్లపై రూ.24,305 ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లించాలి. ఇక బైక్‌కు ఒకే సారి ఐదేళ్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 75 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉంటే థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.1000, ఇక 75 నుంచి 150 సీసీ వరకు రూ.3285... 150 నుంచి 350 సీసీ వరకు గల బైక్‌లకు రూ.5,453 ప్రీమియంగా కట్టాల్సి ఉంటుంది. 350కి మించి సీసీ బైక్‌లపై రూ.13,034 ప్రీమియాన్ని వర్తింప జేస్తారు. జులై 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఆర్డీఐ ఈ నిర్ణయం తీసుకుంది.