జియో సరికొత్త ఆఫర్లు.. రూ.22 నుంచే స్టార్ట్..!

జియో సరికొత్త ఆఫర్లు.. రూ.22 నుంచే స్టార్ట్..!

రిలయన్స్ జియో తన యూజర్లతో పాటు కొత్త కస్టర్లను ఆకట్టుకునే పనిలో పడిపోయింది.. సరికొత్త ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.. కొత్త డేటా ప్లాన్స్‌ కేవలం రూ. రూ. 22 నుంచే ప్రారంభం కానున్నాయి.. ఇక, రూ. 22, రూ.52, రూ.72, రూ.102, రూ.152తో  మొత్తం ఐదు కొత్త డేటా ప్లాన్స్‌ తీసుకొచ్చింది జియో.. ఈ అన్ని ప్యాకేజీల వ్యాలిడిటీ 28 రోజుగా నిర్ణయించింది.. రూ. 22 ప్యాక్‌లో 2 జీబీ డేటా, రూ.52 ప్యాక్‌తో 6 జీబీ డేటా, రూ.72 ప్యాక్‌తో ప్రతీరోజు 0.5జీబీ డేటా, ఫైనల్‌గా రూ.102 ప్యాక్‌తో ప్రతీరోజూ 1 జీబీ డేటా అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. ఈ ప్యాక్‌ల ద్వారా జియో యాప్స్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉండగా.. ఎలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు మాత్రం లేవని స్పష్టం చేసింది. కాగా, జియో గతవారం జియో ఫోన్ యూజర్ల కోసం రూ. 749 యాన్యువల్ ప్లాన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక, కొత్త కస్టమర్లకు రూ. 1999, రూ. 1,499 ప్లాన్స్ కూడా తీసుకు వచ్చింది.