కేసీఆర్, కేటీఆర్‌కు కొత్త ఎమ్మెల్సీ ధన్యవాదాలు..

కేసీఆర్, కేటీఆర్‌కు కొత్త ఎమ్మెల్సీ ధన్యవాదాలు..

తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది.. టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.. ఇక ఉపసంహరణ తేదీ ముగియడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ మేరకు ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర మంత్రులు తలసాని, మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ నవీన్‌రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని అంకిత భావంతో పనిచేస్తానని ప్రకటించారు నవీన్‌రావు. పార్టీ ప్రతిష్ట పెంపొందించేందుకు ఎమ్మెల్సీగా నా వంతు ప్రయత్నాన్ని బాధ్యతతో కొనసాగిస్తానన్న ఆయన.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.