పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు!

పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు!

పవన్ కళ్యాణ్ - సాగర్ కె. చంద్ర కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు సమవుజ్జిగా ఉండే కోషి పాత్రను రానా చేయబోతున్నాడని సినిమా ప్రారంభోత్సవం నాడే ప్రకటించారు. అలానే సంక్రాంతి కానుకగా ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం బలం అండగా ఉండబోతోంది.. ఇక ఇందులో పవన్, రానా సరసన నటించే హీరోయిన్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

తమన్ స్వరాలు సమకూర్చబోతున్న ఈ సినిమాను ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ చేయాలని యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా... సితార ఎంటర్ టైన్ మెంట్ కు ఇప్పటికే ఓ ఆఫీస్ ఉన్నా... ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఫిల్మ్ నగర్ లోని అపోలో హాస్పిటల్  సమీపంలో వేరొక ప్రొడక్షన్ ఆఫీస్ ను ఇటీవల ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తీసిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతోనే ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తీస్తున్నారని, కొత్త ఆఫీస్ నూ అందుకే  తీసుకున్నారని తెలుస్తోంది.