తమిళనాడులో మరో కొత్తపార్టీ... రజిని ఆశీర్వాదంతోనే...!!

తమిళనాడులో మరో కొత్తపార్టీ... రజిని ఆశీర్వాదంతోనే...!!

తమిళనాడులో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఎదురు చూశారు.  కానీ, ఎవరూ ఊహించని విధంగా రజినీకాంత్ అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.  దీంతో రజిని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.  రజిని అభిమాన సంఘాలు ఇటీవలే చెన్నైలోని రజిని ఇంటిముందు కొంత హడావుడి సృష్టించాయి.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు రజినీకాంత్ వర్గం నుంచి మరోవ్యక్తి కొత్త పార్టీని స్థాపించబోతున్నారు.  అయన ఎవరో కాదు, రజినీకాంత్ పార్టీ ప్రధాన కార్యాలయం సమన్వయ కర్తగా వ్యవహరించిన అర్జునమూర్తి.  తమిళనాడులోని బీజేపీ మేధోవిభాగం అధ్యక్షుడిగా పనిచేసిన అర్జునమూర్తి, అక్కడి నుంచి రజినీకాంత్ తో సన్నిహితంగా మారారు.  రజినీకాంత్ పార్టీకి సంబంధించిన పనుల్లో చురుగ్గా వ్యవహారించారు.  ఎప్పుడైతే రజినీకాంత్ అర్జున మూర్తిని రజినీకాంత్ పార్టీ ప్రధాన కార్యాలయం సమన్వయ కర్తగా ప్రకటించారో అప్పుడే బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది.  కాగా, ఇప్పడు రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావడం లేదు కాబట్టి, అర్జునమూర్తి కొత్తపార్టీని పెట్టబోతున్నారట.  పోయెస్ గార్డెన్ లో త్వరలోనే సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించబోతున్నారు.  రజినీకాంత్ ఆశీర్వాదం తనకు ఉందని, రజినీకాంత్ అభిమానులు తనను ఆదరిస్తారని అంటున్నారు అర్జునమూర్తి.