కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో కొత్త ఆంక్షలు

కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో కొత్త ఆంక్షలు

కరోనా విజృంభణతో స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న తరుణంలో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.. బెంగళూరు సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది.. వీటితో పాటు అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని స్విమింగ్‌పూల్స్, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇక, తాజాగా కర్ణాటకలో 6,150 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బెంగళూరు సిటీలోనే 4,266 కేసులు వెలుగుచూశాయి.. 39 మంది మృతిచెందారు.. వారిలో 26 మంది సిటీలోనే మరణించారు.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కఠిన నిబంధనలు అమలు చేసేందుకు పూనుకుంది. ఇక, కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10.26 లక్షలు దాటిపోగా.. ఇప్పటి వరకు 9,68,762మంది రికవరీ అయ్యారు.. ప్రస్తుతం 45,107 యాక్టివ్ కేసులు ఉండగా.. 12,696 మందిని ప్రాణాలు తీసింది కరోనా వైరస్.