అన్నవరం దేవస్థానంలో నూతన నిబంధనలు

అన్నవరం దేవస్థానంలో నూతన నిబంధనలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జూన్ 1 నుంచి నియమ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. సత్యదేవున్ని దర్శించుకునే భక్తులు, వ్రతం నిర్వహించేవారు తప్పని సరిగా డ్రెస్ కోడ్ పాటించేలా చర్యలు తీసుకునేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దేవస్థాన పరిసరాల్లో ఎటువంటి లగేజ్ గానీ, సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. ఇందుకోసం భక్తులకు లాకర్ సదుపాయం కల్పించనున్నారు. దేవస్థాన సత్రం గదుల కేటాయింపులో సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ కార్డుతో సహా బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని నిర్ణయించారు. గది తీసుకున్న వారే తిరిగి గది ఖాళీ చేసి వెళ్లి డిపాజిట్ సొమ్ము తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ నూతన విధానాలన్ని జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు అన్నవరం దేవస్ధానం ఈవో సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.