అలెర్ట్‌: ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్‌..

అలెర్ట్‌: ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్‌..

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ చెబుతుంటే.. మ‌రికొన్ని జేబుకు చిల్లు పెట్ట‌నున్నాయి.. కార్లు, బైకుల ధ‌ర‌ల భారం క‌స్టమ‌ర్ల‌పై త‌గ్గి.. కొత్త వాహ‌నాల కొనుగోలుకు ఊత‌మిచ్చే అవ‌కాశం ఉండ‌గా.. ఇక‌, ప్ర‌ధాని మంత్రి కిసాన్ యోజ‌న ప‌థ‌కం డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ కాబోతున్నాయి. అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జ‌ర‌గబోతున్నాయి. వాటిలో ముఖ్య‌మైనవాటి గురించి తెలుసుకుని.. అస‌లే క‌రోనా క‌ష్టాల స‌మ‌యంలో.. ప్ర‌జ‌లు త‌మ జేబు ఖాళీ కాకుండా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం..

కొత్త రూల్స్‌: 
* ఐఆర్‌డిఏః కొత్తగా బైక్ లేదా కారు కొనేవారికి ఇన్స్యూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభ‌వార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి కార్లు, బైకులు కొనేవారికి కొత్త రూల్స్ వ‌ర్తించ‌బోతున్నాయి. ఇంత‌కుముందు వ‌ర‌కూ లాంగ్ ట‌ర్మ్ వెహిక‌ల్ ఇన్యూరెన్స్ ప్యాకేజీ పాల‌సీలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. కానీ, ఇక‌పై అలాంటి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి క‌స్ట‌మ‌ర్ల‌కు కార్లు లేదా బైకుల ఆన్ రోడ్ ధ‌ర త‌గ్గిపోనుంది. 
* ఈ-కామ‌ర్స్ః ఇవాళ్టి నుంచి ఈ-కామ‌ర్స్ కంపెనీల ఉత్ప‌త్తుల‌పై ఏ దేశానికి చెందిన ప్రోడెక్ట్ అనే విష‌యాన్ని వివ‌రించాల్సి ఉంటుంది. అంటే వినియోగ‌దారులు కొనే వ‌స్తువులపై మేడ్ ఇన్ ఇండియాలో త‌యారు చేసిన వ‌స్తువులా? లేదా ఇత‌ర దేశాల్లో త‌యారైన వ‌స్తువులా? అని గుర్తించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఇవాళ్టి నుంచి అమ‌లులోకి రానున్నాయి. 
* ఆర్బీఐః ఆర్బీఐ సేవింగ్స్ ఖాతాల‌పై ఇవాళ్టి నుంచి వ‌డ్డీ రేట్లు మార‌బోతున్నాయి. అంటే కొత్త వ‌డ్డీ రేట్లు అమ‌లులోకి వ‌స్తాయి. ల‌క్ష రూపాయ‌ల‌లోపు ఉంటే 4.75 శాతం, ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే 6 శాతం, 10 ల‌క్ష‌ల నుంచి 5 కోట్ల ఉంటే 6.75 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అలాగే డెబిట్ కార్డు పోగొట్టుకున్నా, డ్యామెజ్ అయినా.. కొత్త కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
* మినిమ‌మ్ బ్యాలెన్స్ః క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇన్ని రోజులు మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధ‌న‌లు ఎత్తివేశాయి బ్యాంకులు. అయితే, లాక్‌డౌన్ ముగిసిపోయి.. అన్‌లాక్ 3.0లోఅడుగుపెట్టాం.. దీంతో ఇవాళ్టి నుంచి మినిమ్ బ్యాలెన్స్ రూల్స్ మార‌నున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర మూడు ఫ్రీ ట్రాన్సాక్ష‌న్స్ త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల నుంచి ఛార్జీలు వ‌సూలు చేయ‌బోతున్నాయి.
*. పీఎం కిసాన్ః ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థకం డబ్బుల్ని.. కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నుంది. రెండు వేల రూపాయ‌ల చొప్పున ఆరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల ఖాతాల్లోకి బ‌దిలీ చేయనుంది. మొత్తానికి కొత్త రూల్స్ ఇవాళ్టి నుంచి కొత్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుండ‌గా.. మ‌రికొన్ని మాత్రం షాక్ ఇవ్వ‌నున్నాయ‌న్న‌మాట‌.