కాపీ కొట్టకుండా సరికొత్త ట్రిక్...తలకి బాక్సులు !

కాపీ కొట్టకుండా సరికొత్త ట్రిక్...తలకి బాక్సులు !

పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు మన దేశంలో చాలా రకాలుగా నిబంధనలు విధిస్తున్నారు. అయినా ఎక్కడో ఒక చోట ఈ కాపీ అంశాలు వింటూనే ఉంటాం. అయితే కర్నాటక రాష్ట్రం హవేరిలోని ఒక కాలేజ్ లో మాత్రం కాపీ కొట్టకుండా ఉండేందుకు ఏకంగా పిల్లల తలలకు కార్డ్ బోర్డు బాక్స్ లను తొడించారు. ఈ బాక్సులతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యారని అంటున్నారు. ఈ విషయం బయటికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కన్నడ విద్యా బోర్డు ఈ విషయం మీద నోటీసులు కూడా జారీ చేసింది. గతంలో ఇలాంటి ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అప్పట్లో ఆ ఘటనకు బాధ్యుడైన టీచర్‌ను తొలగించాలని కూడా డిమాండ్ లు వచ్చాయి. అయితే అప్పుడు అక్కడి యాజమాన్యం మాత్రం విచిత్రంగా స్పందించింది. ఇలా చేయడం ద్వారా విద్యార్థుల సైకోమీటర్ డెవలప్‌మెంట్‌కి ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఇలా విద్యార్థుల తలలకు బాక్సులు, పేపర్లు పెట్టడం ద్వారా కాపీ కొట్టడం ఆగడంతో పాటు వారి మేధో శక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు.