గ్రామ వలంటీర్లకు కొత్త కష్టాలు..!!

గ్రామ వలంటీర్లకు కొత్త కష్టాలు..!!

ఆగష్టు 15 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే.  ఆగష్టు 15 వ తేదీన ఎంపికైన వలంటీర్లు ఆయా మండల పరిధిలోని కార్యాలయాల్లో రిపోర్ట్ చేశారు.  శుక్రవారం నుంచి గ్రామాల్లో సర్వే చేయడం మొదలు పెట్టారు.  ఒక్కో వలంటీర్ 50 ఇళ్లను సర్వేచేయాలి.  అయితే, ఈ సర్వేలో అడిగిన ప్రశ్నలకు చాలామంది సమాధానాలు ఇవ్వడం లేదట.  

ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలను ఇచ్చేందుకు చాలామంది ఇష్టపడటం లేదని సమాచారం.  సర్వేలో పేర్కొన్ని కొన్ని వ్యక్తిగత సమాచారాన్ని సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటే.. మీకెందుకు అని ప్రశ్నిస్తున్నారని వలంటీర్లు వాపోతున్నారు.  ఇక వరదనీటిలో చిక్కుకున్న గ్రామాల్లోకి వలంటీర్లు వెళ్లలేకపోతున్నారు.  ప్రస్తుతం అక్కడ వరద సహాయక చర్యల్లో ఈ వలంటీర్లు పాల్గొంటున్నారని తెలుస్తోంది.