సెట్‌టాప్ బాక్సుల్లో చిప్‌తో నిఘా పెడుతున్న సర్కార్‌!

సెట్‌టాప్ బాక్సుల్లో చిప్‌తో నిఘా పెడుతున్న సర్కార్‌!
మీరు టీవీలో ఏం చేస్తున్నారు? ఎంత సేపు చూస్తున్నారు? మీ అభిరుచి ఏంటి? మీకు ఇష్టమైన చానెల్ ఏంటి? ఇలా అన్ని తెలిసిపోనున్నాయా? టీవీ సెట్‌టాప్ బాక్స్‌ల్లో చిప్‌తో జనంపై నిఘా కేంద్రం నిఘా పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది... ప్రజల అభిరుచిని పసిగట్టే పనిలో భాగంగా టీవీ సెట్‌టాప్ బాక్స్‌లలో చిప్ అమర్చాలని యోచిస్తోంది కేంద్ర సమాచార ప్రసారాలశాఖ. ఈ విషయమై ఓ అధికారి స్పందిస్తూ టీఆర్పీ రేటింగ్‌ను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. దీంతో విస్తృతంగా వీక్షించిన ఛానెల్లను మాత్రమే ప్రోత్సహించబడతాయంటున్నారు ఆ అధికారి. తదనుగుణంగ ప్రభుత్వం ప్రకటనలను తగిన రీతిలో ఇవ్వగలుగుతుందని, ఈ విధంగా ప్రభుత్వ ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ ప్రతిపాదనలో... ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ విధంగా పేర్కొంది... కొత్త సెట్-టాప్ బాక్సుల్లోని చిప్స్‌ను అమర్చాడానికి డీటీహెచ్ ఆపరేటర్లను అడగాలని ప్రతిపాదించింది, ఇది చానెళ్లను చూడటం మరియు వారి వ్యవధి గురించి సమాచారం ఇవ్వనుంది.