నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్... 

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్... 

నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.  తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేశారు.  ఈ రిపోర్ట్ లో ఏ 1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయిరెడ్డి, ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని చేర్చారు.  ముగ్గురు వ్యక్తుల వేధింపులతో ఒత్తిడికి గురైన నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు.  పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణలను పోలీసులు రిమాండ్ కు తరలించారు.  అయితే, సోమవారం రోజున విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డి పరార్ కావడంతో అయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఈ కేసులో అశోక్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉండటంతో అయన కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.