ఆర్మీ జవాన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ఆర్మీ జవాన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

గుంటూరు జిల్లాలో జరిగిన ఆర్మీ జవాన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ముఠా గుట్టు తెలియక ఆర్మీ జవాన్ సత్యనారాయణ మధ్యవర్తిత్వం నడిపాడు. తమ్ముడు ఉద్యోగం కోసం కూడా డబ్బులు కట్టాడు. బాధితుల ఒత్తిడి పెరగడంతో ముఠా సభ్యులపై వత్తిడి తెచ్చాడు. దీంతో సత్యనారాయణను నమ్మకంగా పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ, గుంటూరు, విజయనగరంలో పలువురి అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు వద్ద ఆర్మీ జవాన్ సత్యనారాయణ గొంతుకోసి చంపేసిన ఘటన తెలిసిందే.