దుర్గమ్మ చీర మాయంపై ఈవో కీలక నివేదిక..

దుర్గమ్మ చీర మాయంపై ఈవో కీలక నివేదిక..

విజయవాడ కనకదుర్గమ్మ 'చీర' మాయంపై ప్రభుత్వ సీరియస్‌ అవడంతో 24 గంటల్లోనే ఈవోపద్మ నివేదిక సిద్ధం చేశారు. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీసినట్టు నిర్థారించినట్టు నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నివేదిక పంపడానికి ముందు విచారణలో భాగంగా ఈవో వన్‌ టౌన్‌ పోలీసులతో మాట్లాడారు. పాలకమండలి సభ్యులే చీర తీశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని ఈవోకి పోలీసులు తెలియజేశారని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఘటనకు కారకులైనవారిపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో ఈవో కోరినట్టు తెలిసింది.