శిశువు కిడ్నాప్ కేసులో పురోగతి

శిశువు కిడ్నాప్ కేసులో పురోగతి

చిన్నారి వయసు ఆరు రోజులు. తల్లి దగ్గర పాలు తాగడం తప్ప మరేమి తెలియని ఆ పసిపాప కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో కిడ్నాప్ అయి 24 గంటలు అయినా ఇంకా ఆచూకీ తెలియలేదు. వాక్సిన్ వేయిస్తానని తీసుకెళ్లిన మహిళ ఆ చిన్నారిని ఎత్తుకెళ్లింది. మెటర్నిటీ ఆసుపత్రి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్  ఎంజీబీఎస్ వెళ్లినట్టు గుర్తించారు. అక్కడి నుండి బీదర్ బస్సు ఎక్కింది. సీసీ ఫుటేజ్ లోని బస్సు నెంబర్ ఆధారంగా బీదర్ వెళ్లిన బస్సు కండక్టర్, డ్రైవర్ ను పోలీసులు విచారించగా.. శిశువుతో పాటు కిడ్నాప్ చేసిన మహిళ బీదర్ లో దిగిందంటూ పోలీసులుకి స్టేట్ మెంట్ ఇచ్చారు. బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగిన కిడ్నాపర్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో బీదర్, తెలంగాణాలో 11 పోలీస్ బృందాలు కిడ్నాపర్ కోసం గాలిస్తున్నాయి.