మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్ కేసు.. వెలుగులోకి కొత్త దందా..!

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్ కేసు.. వెలుగులోకి కొత్త దందా..!

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భూ వ్యవహారంలో ఎన్‌వోసీ ఇవ్వడానికి రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి, ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఆయనతోపాటు నర్సాపూర్ ఆర్డీవో,  తహసీల్దార్ , మరొక ఉద్యోగి నగేష్ బినామీ ఈ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు, అయితే అప్పటి నుంచి రెవెన్యూ అక్రమార్కుల దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ అధికారులు లీలలు చెప్తూ బాధితులు బయటకు వస్తున్నారు, లేటెస్ట్ గా బాజీపల్లి భూముల వ్యవహారంలో పాత తేదీలు, ఫోర్జరీ సంతకాలతో దందా మొదలు పెట్టి,  దస్తావేజుల పేర్లను ఇరికించి రాసిన విషయం బయటకు వచ్చింది. పాత రికార్డులో కూడా వీళ్లే భూ యజమానులు అని 2007 నుంచి 2013 వరకు ఉన్న పేర్లను చేర్చారు. సైనిక ఉద్యోగులకు భూమికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలంటే, అది అమ్ముతాం అంటేనే ఇస్తామని మెలికలు పెట్టేవారు. తమకు నచ్చిన వారితో ఒప్పందాలు కుదుర్చుకుని డీల్ మాట్లాడుకునేవారు. రాజకీయ నాయకులతో కలిసి ఇష్టారీతిన వ్యవహరించేవారు. ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలులా వాటాలు వేసి మరీ పంచుకునేవారు.