బ్రేకింగ్ : ఎమ్మెల్యే సోదరి కుటుంబం కేసులో కొత్త ట్విస్ట్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే సోదరి కుటుంబం కేసులో కొత్త ట్విస్ట్

పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కేసులో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. గత నెల 28 నుండి రాధిక కుటుంబం ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయని అంటున్నారు. ఇదే విషయాన్ని అదే రోజున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాచారం కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే బావ మరిదికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తి 28నే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోన్ లో సమాచారం ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ రోజునే సోదరి ఇంటి తాళాలు పగలకొట్టిన ఎమ్మెల్యే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టుగా చెబుతున్నారు. గత నెల 28న మిస్ అయితే నిన్నటి దాకా అంటే 22 రోజుల పాటు కనీసం పోలీసులకి ఎందుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేయలేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృత్తిరీత్యా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక ఉపాధ్యాయురాలు కాగా, ఆమె భర్త సత్యానారాయణ రెడ్డి ఫర్టిలైజర్‌ వ్యాపారం చేస్తున్నారు. ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెల్లెలు.. కుటుంబంతో సహా అదృశ్యమైతే ఎవరికీ పట్టలేదా? అనేది సంచలనంగా మారింది.