మీడియా ముందుకు రమణదీక్షితులు చిట్టా..!

మీడియా ముందుకు రమణదీక్షితులు చిట్టా..!

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడుగా పనిచేస్తూ రాష్ట్రప్రభుత్వం, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితుల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది... రమణ దీక్షితులు వ్యవహారంతో ఆయనపై వేటు వేసి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఏకంగా నలుగురు ప్రధాన అర్చకులను నియమించిన టీటీడీ... విమర్శలు గుప్పిస్తున్న రమణదీక్షితులుకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు ఉదయం 11  గంటలకు మీడియా ముందుకు రానున్నారు ఈవో సింఘాల్... ఈ సమావేశంలో రమణదీక్షితులు ఆరోపణలుకు వివరణతో పాటు... ఆయన తప్పిదాలును కూడా ఎత్తిచూపే అకాశం ఉందంటున్నారు. 

వెయ్యికాళ్ల మండపం తొలగింపునకు అప్పట్లోనే పంచ జెండా ఊపిన దీక్షితులు... ఇప్పుడు టీటీడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు అధికారులు. దీంతో రమణదీక్షితులు చిట్టా మొత్తం మీడియా ముందు ఉంచే ప్రయత్నంలో ఉంది టీటీడీ. ఇప్పటికే రమణదీక్షితులు ఆరోపణలను మీరాశి అర్చకులు, ఆలయ జియ్యంగార్లు ఖండించగా... ఈ రోజు ఈవో ప్రెస్ మీట్‌తో రమణ దీక్షితులు వివాదం మరో కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.