విజయవాడ చిన్నారి హత్యకేసులో కొత్త కోణాలు !

విజయవాడ చిన్నారి హత్యకేసులో కొత్త కోణాలు !

విజయవాడ భవానీపురం చిన్నారి హత్యకేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నారు. చిన్నారిని నిందితుడు ప్రకాశ్‌ అత్యాచారం చేసినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక రహస్య శరీర భాగాల్లో రక్తం మరకలను గుర్తించారు. గతంలోను నిందితుడు ఓ మైనర్‌పై అత్యాచారయత్నం చేశాడు. ఈ కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. చిన్నారి హత్య కేసులో తల్లి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఈ విషయం మీద కొన్ని మీడియా సంస్థలలో(ఎన్టీవీ కాదు) రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పోలీసులు చెప్పినట్టుగా ఆ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఈ కేసులో పూర్తి వివరాలు అయితే ఇంకా బయటకు రాలేదు. ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా ఆమె మృతదేహాన్ని నల్లకుంట గ్రామానికి తరలించారు. పోస్టుమార్టం మొత్తాన్ని డాక్టర్లు వీడియోల ద్వారా రికార్డు చేసి భద్రపరిచారు. నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్‌లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుందని అంటున్నారు.