ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..!!

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..!!

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇందులో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నారు.  ఎన్టీఆర్ ఇందులో రెండు రకాల లుక్స్ తో కనిపించబోతున్నాడు.  ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తే.. సెకండ్ హాఫ్ లో మరో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట.  

సెకండ్ హాఫ్ లో వచ్చే లుక్ అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని, ఎన్టీఆర్ ను ఆ లుక్ లో చూసి షాక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.  సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ లుక్ ఏంటనేది సస్పెన్స్.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ కు రిలీజ్ కానున్నది.