రజిని దర్బార్ పక్కా పగడ్బందీగా...

రజిని దర్బార్ పక్కా పగడ్బందీగా...

పెట్ట తరువాత రజినీకాంత్ చేస్తున్న సినిమా దర్భార్.  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది.  షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ బయటకు రావడంతో దర్బార్ టీం అలర్ట్ అయ్యి... జాగ్రత్తలు తీసుకుంటున్నది.  లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

ప్రతీక్ బబ్బర్ తో పాటు ఇందులో మరో విలన్ కూడా ఉన్నాడట.  మలయాళం నటుడు చెంబన్ వినోద్ జొస్ విలన్ గా చేస్తున్నాడు.  ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  వచ్చే ఏడాది పొంగల్ ను టార్గెట్ చేసిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.