టెస్ట్ మ్యాచ్: భారత్ పై కివీస్ భారీ ఆధిక్యం... 

టెస్ట్ మ్యాచ్: భారత్ పై కివీస్ భారీ ఆధిక్యం... 

ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ వెల్లింగ్టన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.  బ్యాట్స్మెన్స్ విఫలం కావడంతో తక్కువ స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు ఆచితూచి ఆడింది.  మూడోరోజు ఇండియాపై భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.  

ఆదివారం మూడో రోజు 216/5 తో ఆట ప్రారంభించిన కివీస్ జట్టు 348 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.  దీంతో కివీస్ ఇండియాపై 183 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.  కాగా, ఇండియా రెండో ఇన్నింగ్ ప్రారంభించాల్సి ఉన్నది.  మరి ఈ ఆధిక్యాన్ని ఛేజ్ చేసి, ఆటను నిలబెట్టుకుంటారో లేదంటే, చేతులెత్తేస్తారో చూడాలి.  ఇప్పటికే ఇండియా వన్డే సీరీస్ కోల్పోయింది.  ఎలాగైనా టెస్ట్ సీరీస్ గెలిచి తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోంది టీమ్ ఇండియా.