కివీస్ కెప్టెన్ ఆవేదన..!

కివీస్ కెప్టెన్ ఆవేదన..!

ఐసీసీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్ రెండు సార్లు టై అయినా.. అనూహ్యంగా ఇంగ్లండ్ జట్టు విజయం సాధించినట్టు ప్రకటించారు. వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఇంగ్లండ్ జట్టు ఓవైపు.. కష్టపడి ఫలితం చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు మరోవైపు. అయితే, టోర్నమెంట్ ఫైన‌ల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని బౌండ‌రీల సంఖ్య ఆధారంగా నిర్ణయించ‌డం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై తొలిసారి స్పందించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌.. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఇక ఆ బాధనంత దిగమింగుకొని ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు కివీస్ కెప్టె... ఈ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని, అంతిమంగా మమ్మల్ని ఏదీ విడదీయలేదని.. ఇంగ్లండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా అని వ్యాఖ్యానించారు విలియమ్సన్.. ఇక, బౌండరీల పద్ధతిలో విజేతని ప్రకటించడంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన.. ఇలాంటి ప్రశ్నని అడగాల్సి వస్తుందని మీరు కూడా ఊహించి ఉండరనే అనుకుంటున్నా. అలాగే నేను కూడా ఈ విషయంపై సమాధానం చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ నవ్వుతో బదులిచ్చారు. అయితే రెండు టీమ్‌లు సమానమై ఆటను ప్రదర్శించినప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు విలియమ్సన్.