ట్విస్ట్ : ఐపీఎల్ కు మాకు సంబంధం లేదు అంటున్న న్యూజిలాండ్... 

ట్విస్ట్ : ఐపీఎల్ కు మాకు సంబంధం లేదు అంటున్న న్యూజిలాండ్... 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎడిషన్‌కు తాము ఆతిథ్యం ఇవాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలు అన్ని అవాస్తవాలని తేల్చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సి). కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీసీసీఐ భారతదేశంలో ఐపీఎల్ ను నిర్వహించలేకపోతుంది. అయితే ఈ లీగ్ కు మేము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం అని యుఎఇ మరియు శ్రీలంక ఇప్పటికే బీసీసీఐ కి లేఖ రాశాయి. ఆ తర్వాత ఈ రెండు దేశాలకు పోటీగా న్యూజిలాండ్ వచ్చింది అని వార్తలు వచ్చాయి. అయితే ఐపీఎల్ కు ఆతిథ్యం ఇవ్వడానికి మేము ముందుకు రాలేదు, అలా చెయ్యాలనే ఆలోచన కూడా మాకు లేదు అని ఎన్‌జెడ్‌సి ప్రతినిధి రిచర్డ్ బూక్ ఆర్‌ఎన్‌జెడ్‌కు చెప్పారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే విదేశాలలో జరిగింది. అయితే ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబరులో జరగనున్న టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడితే , ఆ విండోలో ఐపీఎల్ జరపాలని బీసీసీఐ చూస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.