వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే...?

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే...?

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్ ఫైట్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ముందు 242 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే కలిసి వచ్చే పిచ్‌పై కివీస్ కెప్టెన్ బ్యాటింగ్‌ ఎంచుకున్నా.. శుభారంభం దక్కలేదు. 29 దగ్గరే మార్టిన్‌ గప్తిల్‌ 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. కేన్‌ విలియమ్సన్‌ 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నికోల్స్ 55, లాథమ్ 47, విలియమ్సన్‌ 30 పరుగులు మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో 241 పరుగులకే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పరిమితమైంది. ఇక ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. వోక్స్‌, ప్లంకెట్ చేరో 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. వుడ్, ఆర్కర్‌ తలో వికెట్ తీశారు.