బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

న్యూజిలాండ్‌తో ఈ రోజు జరిగే మూడో వన్డే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ధోనీ స్థానంలో కార్తీక్, విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్‌ పాండ్యా తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ ఒక మార్పు చేసింది. గ్రాండ్హోమ్ స్థానంలో సాన్‌ట్నర్ వచ్చాడు. మూడో వన్డేను కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన కివీస్‌ సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

జట్లు:

భారత్‌: 
రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు, జాదవ్, కార్తీక్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, చహల్‌.

న్యూజిలాండ్‌: 
గప్టిల్, మున్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బ్రేస్‌వెల్, సోధి, ఫెర్గూసన్, బౌల్ట్‌.