ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

న్యూజిలాండ్‌తో ఈ రోజు జరిగే నాలుగో వన్డే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కోహ్లీ స్థానంలో గిల్, షమీ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. నాలుగో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని టీమిండియా చూస్తోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో రోహిత్‌ శర్మ సారథిగా బాధ్యతలు చేపట్టాడు.

జట్లు:

భారత్‌: 
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, ఖలీల్‌ అహ్మద్‌. 

న్యూజిలాండ్‌: 
మార్టిన్‌ గప్తిల్‌, హన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, టాడ్‌ ఆస్టిల్‌, మాట్‌ హన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌.