కేసీఆర్‌ను అనుసరిస్తున్న న్యూజిలాండ్...ప్రజలకు నేరుగా...

కేసీఆర్‌ను అనుసరిస్తున్న న్యూజిలాండ్...ప్రజలకు నేరుగా...

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు..హెలికాప్టర్‌ మనీ ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కేంద్రానికి సూచించారు. అప్పట్నుంచీ ఈ హెలికాప్టర్‌ మనీపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఇప్పుడు ఈ హెలికాప్టర్‌ మనీపై న్యూజీలాండ్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. తమ దేశంలో ఆర్థిక వ్యవస్థను గట్టించేందుకు అక్కడి ప్రభుత్వం.. హెలికాప్టర్‌ మనీ విధానాన్ని పరిశీలిస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రజలకు నేరుగా డబ్బును అందించే హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది.