న్యూజిలాండ్ ఎదురీత..

న్యూజిలాండ్ ఎదురీత..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 306 పరుగుల టార్గెట్‌ను పెట్టింది. బెయిర్‌స్టో సెంచరీతో (106 పరుగులు) చెలరేగి ఇంగ్లండ్ ఇన్సింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్ 60 పరుగులతో రాణించగా... రూట్ 24‌, బట్లర్‌ 11, స్టోక్స్‌ 11 పరుగులు మాత్రమే చేశారు. ఇక, వరుస వికెట్లు కోల్పోతోన్న సమయంలో మోర్గాన్‌ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో రషీద్‌ 16, ఫ్లంకెట్‌ 15 (నాటౌట్‌) పరుగులు చేయడంతో 305 పరుగులు చేసింది. 306 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ లక్ష్యఛేదనలో తడబడుతోంది... ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్‌ 8 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ డకౌట్ అయ్యాడు. తర్వాత నిలదొక్కుకుంటూ పరుగులు చేసే ప్రయత్నంలో కేన్‌ విలియమ్సన్‌ 27 పరుగుల దగ్గర రనౌట్ అయ్యాడు. ఇక, రాస్‌ టేలర్‌ కూడా 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కనీసం జట్టు స్కోర్ 100 దాటకుండానే నలుగురు కీలక ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ప్రస్తుతం టామ్‌ లేథమ్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉండగా... జేమ్స్‌ నీషమ్‌ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మొత్తానికి జట్టు స్కోర్ 25 ఓవర్లు ముగిసే సరికి 123గా ఉంది.