ఆలస్యంగా ప్రారంభంకానున్న పాక్- కివీస్ మ్యాచ్

ఆలస్యంగా ప్రారంభంకానున్న పాక్- కివీస్ మ్యాచ్

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో జరగాల్సిన మ్యాచ్ కు వర్షం కలిగించింది. దీంతో టాస్ ఆలస్యంకానుంది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో 4గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మెగా టోర్నీలో అజేయంగా దూసుకెళ్తూ సెమీఫైనల్స్‌ మెట్టెక్కేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది న్యూజిలాండ్‌. మరోవైపు నాకౌట్‌ చేరాలంటే ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌ది. ఈ నేపథ్యంలో రెండు జట్లూ కాసేపట్లో తలపడనున్నాయి.

ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 106 మ్యాచ్‌లు జరగ్గా 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ విజయం సాధించింది. కివీస్‌ 48 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒకటి టై కాగా, మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మెగా ఈవెంట్‌లలో మొత్తం 8 మ్యాచ్‌లాడగా... ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్‌ గెలుపొందాయి.