తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి

తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్, ఆమె సుదీర్ఘకాల ప్రేమికుడు క్లార్క్ గేఫోర్డ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రేమజంట ఈస్టర్ సెలవుల్లో పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమైనట్టు ఆర్డర్న్, గేఫోర్డ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఇద్దరిలో పెళ్లి ప్రస్తావన ఎవరు తెచ్చారనేది తెలియ రాలేదు. ఈస్టర్ సందర్భంగా ఇద్దరూ ప్రదానం చేసుకొన్నట్టు ఆ ప్రతినిధి తెలిపారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

In my other life I'm a professional plus one.

A post shared by Clarke Gayford (@clarkegayford) on

వీళ్లిద్దరికీ నీవీ అనే ఒక పాప కూడా ఉంది. ఆర్డర్న్ గత ఏడాది జూన్ లో నీవీని ప్రసవించారు. ప్రధానమంత్రి పదవిలో ఉండగా ప్రసవించిన రెండో ప్రధాని ఆర్డర్న్. పాపను కన్న తర్వాత టెలివిజన్ ఫిషింగ్ షో హోస్ట్ గేఫోర్డ్ ఇంట్లో ఉండి పాప ఆలనాపాలనా చూశారు. 

ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ ఇటీవల న్యూజిలాండ్ జరిగిన ఉగ్రవాద దాడులను దేశచరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ దాడుల్లో 45 మందికి పైగా మరణించారు. సంఘటన తర్వాత ప్రధాని హిజబ్ ధరించి బాధిత వర్గాలకు బాసటగా నిలిచారు. ఆమె తీసుకొన్న ఈ చర్యను పలువురు ప్రశంసించారు. క్రైస్ట్ చర్చ్ ఉగ్రవాద దాడిని దృష్టిలో ఉంచుకొని దేశంలో అసాల్ట్ రైఫిళ్లు, సెమీ-ఆటోమెటిక్ ఆయుధాల అమ్మకంపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రకటించారు.