పార్లమెంట్‌లోనే పసికందుకు పాలు పట్టిన, ఆడించిన స్పీకర్..

పార్లమెంట్‌లోనే పసికందుకు పాలు పట్టిన, ఆడించిన స్పీకర్..

న్యూజిలాండ్ పార్లమెంట్ అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. స్పీకర్ ట్రేవర్ మల్లార్డ్ పసికందుకి సీసా పాలు పడుతూ.. పార్లమెంట్‌లో చర్చను కొనసాగించడం అందర్నీ అబ్బురపర్చింది. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే  ఆదేశ ఎంపీ తమాతి కొఫీ ఈ మధ్యే పండింటి పసికందును ప్రసవించింది. వెటర్నటీ లీవు కాస్తా ముగియడం, పార్లమెంట్‌లో ముఖ్యమైన డిబేట్ పాల్గొనాల్సి వచ్చింది. తల్లి డిబేట్‌తో బిజీగా ఉండటంతో స్పీకర్ ట్రేవర్ ఆ పాపను ఆడించమే కాదు పాలు కూడా పట్టారు. మామూలుగా అయితే స్పీకర్ కుర్చీలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూర్చుంటారు. కానీ, తనతోపాటు ఇవాళ ఓ వీఐపీ కొలువుదీరిందని ట్వీట్ చేసారు. మీ ఫ్యామిలీలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలని ఎంపీ తమాతి కొఫి, టిమ్ దంపతులను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు.