కరోనా కారణంగా మరో సిరీస్...

కరోనా కారణంగా మరో సిరీస్...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అన్ని దేశాలను వణికిస్తుంది. అయితే ఈ వైరస్ ఇప్పటికే సినిమా షూటింగ్స్, క్రీడా కార్యక్రమాలు అలాగే చాలారకాల మీటింగ్స్ ను వాయిదా వేసేలా చేసింది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్న కారణంగా మళ్ళీ అన్ని ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయంగా వాయిదాపడిన క్రికెట్ మ్యాచ్లు జూలై 8 న ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ తో మొదలవుతున్నాయి. కానీ ఇంకా కొన్ని దేశాలలో కరోనా అదుపుకాకపోవడంతో అక్కడ జరగాల్సిన సిరీస్లు వాయిదా వేస్తున్నారు అధికారులు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌ పర్యటనలో న్యూజిలాండ్ రెండు టెస్టులు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే బంగ్లాలో ఇప్పటికే మాజీ వన్డే అంతర్జాతీయ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజాతో పాటుగా మరో ఇద్దరు క్రికెటర్లకు కరోనా సోకింది. అందువలన ఈ సిరీస్ ను వాయిదా వేస్తునట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ లో ఇప్పటివరకు కరోనా 115,000 మందికి పైగా సోకింది అలాగే ఈ వైరస్ కారణంగా 1,545 మంది మరణించారు.