సౌతాఫ్రికా పోరాటం వృథా.. సెమీస్ ఆశలు గల్లంతు..!
న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు పోరాడి ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ 2019 సెమీస్ లో కూడా ఆడుగుపెట్టడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ల్ ఆడిన సౌతాఫ్రికా... నాలుగో పరాజయం తన ఖాతాలో వేసుకుంది. దీంతో వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్లే! కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించడానికి కెప్టెన్ విలియమ్సన్ అద్భుతంగా పోరాడి సౌతాఫ్రికా జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కివీస్ నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ స్పాట్‌కు దూసుకెళ్లి సెమీకు చేరువకాగా... సౌతాఫ్రికా మాత్రం సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలను చేజార్చుకుంది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లుకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. డసెన్ 67 (నాటౌట్), ఆమ్లా 55 పరుగులతో రాణించారు. ఇక 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు విలియమ్సన్ 106 (నాటౌట్), గ్రాండ్‌హోమ్ 60 పోరాటంతో 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది న్యూజిలాండ్.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్: డికాక్ 5, ఆమ్లా 55, డుప్లెసిస్ 23, మార్క్రమ్ 38, డసెన్ 67 (నాటౌట్), మిల్లర్ 36, ఫెలుక్వాయో డకౌట్, మోరిస్ 6 (నాటౌట్)పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బ్యాటింగ్: గప్తిల్ 35, మన్రో 9, విలియమ్సన్ 106 (నాటౌట్), రాస్ టేలర్ 1, లేథమ్ 1, నీషమ్ 23, గ్రాండ్‌హోమ్ 60, శాంట్నర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)