న్యూజిలాండ్ పై ఆసీస్ విజయం

న్యూజిలాండ్ పై ఆసీస్ విజయం

ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాంగ్ ను 86 పరుగుల తేడాతో ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ విలియమ్సనే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌.  మిచెల్‌ స్టార్క్‌ (5/26) నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు బెరెన్‌డార్ఫ్‌ (2/31) కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. అంతకుముందు బౌల్ట్‌ (4/51), ఫెర్గూసన్‌ (2/49), నీషమ్‌ (2/28)ల ధాటికి ఆసీస్‌ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5 ఫోర్లు), కేరీ (71; 72 బంతుల్లో 11 ఫోర్లు)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బౌల్ట్‌.. వరుస బంతుల్లో ఖవాజా, స్టార్క్‌, బెరెన్‌డార్ఫ్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. బౌల్ట్‌కు వన్డేల్లో ఇది రెండో హ్యాట్రిక్‌. ఈ ప్రపంచకప్‌లో షమి తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ అతనే. వరుసగా ఐదు విజయాలు సాధించిన కివీస్‌కు.. ఇది వరుసగా రెండో ఓటమి. అయితే 11 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌కు చేరువగానే ఉంది.