ఓపెనర్లు అవుట్

ఓపెనర్లు అవుట్

వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. కివీస్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. మూడో ఓవర్లో సౌథీ వేసిన బంతిని భారీ షాట్‌ కొట్టగా.. ఫెర్గూసన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అనంతరం దూకుడు మీదున్న ధావన్ (29).. ఫెర్గూసన్‌ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విజయ్‌ శంకర్‌ (27), రిషబ్ పంత్ (4)లు ఉన్నారు.  8 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 72 బంతుల్లో 156 పరుగులు చేయాలి.