పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత బ్యాట్స్‌మెన్‌

పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత బ్యాట్స్‌మెన్‌

వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. కివీస్ స్పిన్నర్లు శాంట్నర్, సోధిల ధాటికి భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో సహా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 77 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ధావన్ (29), విజయ్‌ శంకర్‌ (27) మినహా అందరూ సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమయినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా జట్టును ఆదుకోలేదు. దీంతో టీమిండియా ఓటమి దిశగా వెళ్తోంది. ప్రస్తుతం క్రీజులో ధోనీ (16), కృనాల్ (7)లు ఉన్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 36 బంతుల్లో 123  పరుగులు చేయాలి.