వీడియో: ధోనీ మెరుపు స్టంపింగ్

వీడియో: ధోనీ మెరుపు స్టంపింగ్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంటే మెరుపు బ్యాటింగ్, స్టంపింగ్ లకు మారుపేరు. బ్యాటింగ్ లో అవసరానికి తగ్గట్టు ఆడే మహీ.. కీపింగ్ లో మాత్రం ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన మెరుపు స్టంపింగ్ లతో విజయాలను అందిస్తాడు మహీ. తాజాగా మౌంట్ మాంగనూయి వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌పై జట్ల మధ్య జరిగిన వన్డేలోనూ ధోనీ తన మార్క్ స్టంపింగ్ చూపించాడు.

కేదార్ జాదవ్ వేసిన 18వ ఓవర్లోని తొలి బంతిని కివీస్ ఆటగాడు రాస్ టేలర్ ఎదుర్కొన్నాడు. బంతి వేయగానే ముందుకు సాగి డిఫెన్స్ ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించగా.. అతని వెనుక కాలు కొద్ది సెకన్ల పాటు గాల్లో ఉంది. ఇది గమనించిన ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి అవుట్ చేసాడు. ఈ స్టంపింగ్ కి జాద‌వ్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో కీపింగ్‌లో తనకు తిరుగులేదని మహీ మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం ఈ స్టంపౌట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.